తమన్నా నటించిన ఓదెల 2 సినిమాకి తాజాగా భారీ షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక కులం పేరుతో అభ్యంతరకరమైన సన్నివేశాలను చిత్రీకరించారని వాటిని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి అంటూ సైబరబాద్ కమిషనర్ కు బీసీ కమిషనర్ అయితే ఫిర్యాదు చేసింది.ఇందులో తమకు అభ్యంతరమైన సన్నివేశాలను తొలగించే విధంగా చేయాలని సెన్సార్ బోర్డ్ కమిషన్ కు సూచించారు. ఈ నెలలో విడుదలైన ఈ సినిమా ఒక వివాహ సన్నివేశంలో సర్పంచ్ రూ .116 రూపాయలు కానుకగా  రాయిస్తారట.


ఈ విషయం పైన జరిగిన కొంతమేరకు వాదనల పిచ్చగుంట్ల కులం పేరు అభ్యంతరంగ ఉపయోగించినట్లు తమ దృష్టికి వచ్చిందంటూ బీసీ కమిషనర్ తెలియజేసింది. దీంతో నిన్నటి రోజున పిచ్చగుంట్ల కులానికి సంబంధించి పి మల్లేష్ నిన్నటి రోజున బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఓదెల 2 చిత్రంలోని అభ్యంతరకర పదాలను తొలగించాలి అంటు కోరినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై ఇదివరకే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు అయ్యిందట. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలియజేశారు.


ఈ విషయంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఒక లేఖ రాస్తూ వెంటనే ఇందుకు  సంబంధించి దర్యాప్తును కూడా మొదలు పెట్టాలని ప్రొడ్యూసర్, డైరెక్టర్ ,రచయిత ఇలాంటి అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించిన నటుల పైన కూడా చర్యలు తీసుకోవాలంటు బీసీ కమిషనర్ కోరిందట. ఫిలిం సెన్సార్ బోర్డు కూడా ఇలాంటి అభ్యంతరకరమైన పదాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించకుండా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం పైన కూడా బీసీ కమిషన్ తప్పుపడుతోంది. ఓదెల 2 చిత్రంలో ఈ అభ్యంతరకరమైన పదాలను వెంటనే తొలగించాలని కమిషన్ కూడా డిమాండ్ చేస్తున్నది. ఇక తెలంగాణ డిజిపి కి కూడా ఈ లేక కాపీని పంపించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వెంటనే సెన్సార్ బోర్డ్ అధికారి కూడా ఈ పదాలను తొలగిస్తామంటూ తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి: