
అనుష్క అంటే మొదటి నుంచి స్పెషల్ గౌరవం ఉన్నా కూడా అనుష్కతో నటించే ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన సున్నితంగా ఈ మూవీని రిజెక్ట్ చేశారట . ఆ సినిమా మరేంటో కాదు అనుష్కశెట్టి కెరియర్ లోనే వన్ అఫ్ ది హిట్గా నిలిచిన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" మూవీ. మహేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ జోనర్లో హిట్ అయింది . జనాలను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అనుష్క శెట్టి యాక్టింగ్ నవీన్ పోలిశెట్టి పర్ఫామెన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. చాలా సింపుల్ కాన్సెప్ట్ తో..చాలా స్మాల్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.
కానీ రిజల్ట్ మాత్రం వేరే లెవల్ అని చెప్పాలి. అంతేకాదు చాలా కాలం తర్వాత అనుష్క శెట్టి ఈ సినిమాలో కనిపించినా జనాలు బాగా ఆమెను ..ఆమె నటనను ఆదరించారు. నవీన్ పోలిశెట్టి గురించి అయితే ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . వేరే లెవెల్ . ఆయన ఏ సినిమాలో కనిపించిన జనాలు కడుపుబ్బ నవ్వుకుంటారు. అంతలా ఆయన పర్ఫామెన్స్ ఇస్తూ ఉంటారు . కాగా ఈ సినిమాలో ముందుగా నవీన్ పోలిశెట్టి కన్నా కూడా హీరో నానిని ఈ క్యారెక్టర్ లో చూపించాలి అనుకున్నారట మహేష్. కానీ నాని క్యారెక్టర్ ను సున్నితంగా రిజెక్ట్ చేశారట . ఇలాంటి క్యారెక్టర్ తనకి సూట్ కాకపోవచ్చు అని ముందుగానే గ్రహించిన నాని ఈ సినిమాను సింపుల్గా రిజెక్ట్ చేసేసారట. ఒకవేళ యాక్సెప్ట్ చేసి ఉంటే మాత్రం సినిమా వేరే లెవల్ లో ఉండేది . జస్ట్ మిస్. ఇక వీళ్ళ కాంబోలో సినిమా వస్తుంది అన్న అశలు ఏ ఒక్క అభిమానికి కూడా లేవు..!