టాలీవుడ్ , కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు వయసు పెరిగే కొద్దీ ఈమె అందం కూడా తగ్గుతోందడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ అమ్మడు వయసు 41 సంవత్సరాలు అయినా ఏమాత్రం కుర్ర హీరోయిన్లకు తీసుకొని అందంతో గ్లామర్ తో చెమటలు పట్టిస్తూ ఉంటుంది. మొదటిసారి 1999లో నీ మనసు నాకు తెలుసు అనే చిత్రం ద్వారా  ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష.


ఆ తర్వాత వర్షం, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, సైనికుడు ,పౌర్ణమి, అతడు, కృష్ణ తదితర చిత్రాలలో కూడా నటించి భారీ క్రేజ్ అందుకుంది. త్రిష తమిళంలో తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించుకుంది ఒకానొక దశలో త్రిష కెరియర్ ముగిసిందని అందరూ అనుకున్నారు కానీ ఊహించని విధంగా తన సెకండ్ అందించిన మొదలుపెట్టి ఒక్కసారిగా స్టార్డంతో దూసుకుపోతోంది త్రిష. ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించిన త్రిష మళ్లీ ఇప్పుడు తిరిగి కూడా అదే స్టార్ హీరోలతో నటిస్తోంది.


అయితే ఇటీవల త్రిష ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే కెరియర్ ప్రారంభంలో తన మానసిక స్థితి గురించి పలు విషయాలను తెలియజేసింది. త్రిష అందాల పోటీలో పాల్గొంటున్న సమయంలో యాడ్స్  లో కూడా నటించిందని ఆ సమయంలో తనకు ఒక సినిమా అవకాశం అయితే లభించింది.. అయితే అగ్రిమెంట్లో సంతకం చేసే ముందు తన తల్లితో.. సినిమా సరిగ్గా ఆడకపోతే తాను ఏమీ చేయలేనని తనను ఎవరు కూడా ఏమనుకూడదని దాంతో తాను సినిమాలు వదిలేసి చదువుకుంటానని కండిషన్ తన తల్లికి చెప్పిందట. ఆ కండిషన్ కి తన తల్లి ఒప్పుకోవడంతో ఆ తర్వాత అగ్రిమెంట్ మీద త్రిష సైన్ చేసిందట. ఒకవేళ మొదటి సినిమా సరిగ్గా ఆడకపోయి ఉంటే ఎప్పుడో సైకాలజిస్ట్ అయ్యేదాన్ని అంటే త్రిష తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: