తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి అందం, నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి సమంత ఒకరు. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసి గొప్ప పేరును సంపాదించుకుంది. 

మాయ చేసావే సినిమాతో పేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా నటించి తన హవాను కొనసాగిస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ నటిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది. ఇక హీరోయిన్ గా మాత్రమే కాకుండా సమంత నిర్మాతగాను మారి "శుభం" సినిమాను నిర్మించింది. ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా నిర్వహిస్తున్నారు.

 రీసెంట్ గా వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించగా మంచి విజయాన్ని అందుకుంది. శుభం సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పాటకు స్టెప్పులు వేస్తూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా రీల్స్ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత బేబీ బంప్ తో ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

అందులో "మీ విత్ మై బేబీ లవ్ ఫర్ సామ్ బేబీ" అంటూ ఓ మహిళా వీడియో తీసి షేర్ చేసుకోగా వైరల్ గా మారింది. ఆ వీడియోను సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. దీంతో ఈ వీడియోను ప్రతి ఒక్కరూ వైరల్ చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని సమంత అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: