
అయితే అన్ స్టాపబుల్ షో కి రాంచరణ్ గెస్ట్ గా వచ్చినప్పుడు రామ్ చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ నాన్నమ్మ అంజనమ్మ ఇద్దరు కూడా 2025లో మాకు ఒక వారసుడు కావాలి అంటూ తమ మనసులోని కోరికను బయటపడతారు . అయితే ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు కానీ బాలయ్య ఈ షోలో 2025 లో మీ ఇంటికి మెగా ఫ్యామిలీకి వారసుడు వచ్చేస్తాడు పో అంటూ సరదాగా రామ్ చరణ్ ని ఆటపట్టించారు. అయితే బాలయ్య సరదాగా అన్న మాటలే లావణ్య త్రిపాఠి నిజం చేసేసింది .
మనకు తెలిసిందే మెగా కోడలు పిల్ల లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ . 2025 లోనే డెలివరీ కాబోతుంది. దీనితో 2025 లోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . అంతేకాదు అన్ స్టాపుల్ షోలో బాలయ్య మాట్లాడిన మాటల క్లిప్స్ వైరల్ చేస్తున్నారు. కాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరైంది.. .!