ఏదైనా మాల ధరిస్తే నాన్ వెజ్ ముట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. కానీ హీరో నవీన్ చంద్ర మాత్రం నేను మాల వేసుకున్నా కూడా నాన్ వెజ్ తింటాను అంటూ మాట్లాడడం వివాదాస్పదంగా మారింది.మరి ఇంతకీ నవీన్ చంద్ర వేసుకున్న ఆ మాల ఏంటి..మాల వేసుకున్నా కూడా ఆయన నాన్ వెజ్ తినడం వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నవీన్ చంద్ర ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా.. మారారు. అలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న ఈయన రీసెంట్ గా శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించారు.అయితే తాజాగా ఈయన కరుంగలి మాల ధరించినా కూడా నాన్వెజ్ తింటాను అని చెప్పారు.ఇక ఈ కరుంగళి మాల పేరు చెప్పగానే ఎక్కువగా వినిపించేది హీరో శివ కార్తికేయన్, ధనుష్ ల పేర్లే.. వీరిద్దరూ ఎక్కువగా ఈ మాల ధరిస్తూ ఉంటారు. 

అయితే తాజాగా కరుంగలి మాల నవీన్ చంద్ర కూడా వేసుకున్నారు.కానీ ఈ మాల ధరించినా కూడా నేను నాన్ వెజ్ తింటాను, పడుకుంటాను అని చెప్పారు. అయితే కరుంగలి మాల అంటే జమ్మి చెట్టు కాడ నుండి తయారుచేసే మాలను కరుంగలి మాల అంటారు. ఇది వేసుకుంటే మంచి పాజిటివ్ నెస్ వస్తుంది. అందుకే ఎక్కువగా దీన్ని ధరిస్తారు.ఈమధ్య యూత్ ఎక్కువగా దీన్ని మెడలో వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆన్లైన్లో కూడా ఇది అందుబాటులో ఉంది.అయితే ఈ కరుంగలి మాల గురించి నవీన్ చంద్ర మాట్లాడుతూ.. కరుంగలి మాల నా మెడలో వేసుకోవడానికి ప్రధాన కారణం మంచి వాసన.ఈ మాల నా మెడలో వేసుకోవడం వల్ల దాని నుండి వచ్చే వాసన కారణంగా నా మైండ్ రిఫ్రెష్ అయ్యి పాజిటివిటీ కలుగుతుంది..

అయితే ఈ దండను నాన్ వెజ్ తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు వేసుకోవద్దు అంటారు. కానీ నేను ఈ దండ వేసుకున్నాక కూడా నాన్వెజ్ తిన్నాను. అది వేసుకునే పడుకున్నాను. ఇది భక్తి కోసం వేసుకునే మాల కాదు. కేవలం వాసన కోసం మాత్రమే వేసుకున్నాను.. అంటూ నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు.మరి నవీన్ చంద్ర మాట్లాడిన ఈ మాటలపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారా.. ఈయన మాటలు వివాదాస్పదంగా మారుతాయా అనేది చూడాలి. ఇక ఈ కరుంగలి మాలను ఎక్కువగా విద్యార్థులు జ్ఞాపకశక్తి పెరగడానికి వేసుకుంటారు. అలాగే బిజినెస్ లో రాణించడానికి, నిరుద్యోగులు వంటి వారు కూడా ఈ కరుంగలి మాల వేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: