కొన్ని రోజుల క్రితం కొంత మంది ఉగ్రవాదులు అమాయకులైన భారతీయులపై దాడి చేసి విచక్షణారహితంగా కొంత మంది భారతీయుల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఇది చేసింది పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు అని తెలిసిపోయింది. దానితో భారతదేశం వారిని ఊరికే వదిలేయకూడదు అని పక్క ప్లానింగ్ తో స్కెచ్ వేసి ఒక్క సారిగా వారి స్థావరాలపై దాడిని చేసి అనేక మంది పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులను నేలమట్టం చేసింది. దీనితో పాకిస్తాన్ - భారత్ దాడి చేసింది ఉగ్రవాదుల పై అయ్యి ఉండవచ్చు.

కానీ భారతదేశ దాడి వల్ల మా ప్రాంతానికి సంబంధించిన అనేక మంది అమాయకులైన ప్రజలు చనిపోయారు. దీనికి ప్రతి కార చర్యగా మేము భారత్ పై దాడి చేస్తాం అని ప్రకటించింది. అందులో భాగంగా భారత్ పై దాడులు చేసింది. కానీ పాకిస్తాన్ చేసిన దాడుల వల్ల ఇండియాకు పెద్దగా నష్టం జరగలేదు. కానీ భారతదేశం చేసిన దాడుల వల్ల పాకిస్థాన్ కి తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. ఇకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన నిజమైన ఉగ్రవాదులు భారత్ ప్రజలపై దాడి చేసి వారిని చంపేశారు. దానిని పాకిస్థాన్ కూడా ఒప్పుకొని ఉండి , అలాంటి ఉగ్రవాదులను చంపివేసినందుకు మేమే మీ బాధపడడం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చి అక్కడనే వదిలేస్తే మ్యాటర్ పెద్దది అయ్యేది కాదు.

ఆ తర్వాత అనవసరంగా భారత్ పై దాడి చేసింది. ఆ దాడి వల్ల పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది. అలాగే ఈ యుద్ధం వల్ల పాకిస్తాన్ అనేక వేల కోట్లు కూడా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. అలాంటి సమయంలో ఈ యుద్ధం వల్ల వీరు మరింత ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది అని , చేజేతులారా పాకిస్తాన్ మరింత కష్టాలను తెచ్చుకుంటుంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: