ఏంటి ప్రపంచ సుందరిగా కిరీటాన్ని గెలుచుకున్న ప్రియాంక చోప్రాకే అవమానం జరిగిందా.. నల్లగా ఉన్నావని స్నేహితులందరూ ఎగతాళి చేశారా..ఇంతకీ వాష్ రూమ్ లో ఆమె ఫుడ్ ఎందుకు తిన్నది.. ఆమె జీవితంలో ఎలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రియాంక చోప్రా మిస్ వరల్డ్ గా మన భారతదేశం నుండి కిరీటం అందుకున్న ఐదో అమ్మాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మిస్ వరల్డ్ కాకముందు ఎన్నో ఇబ్బందులు పడిందట. ముఖ్యంగా తన తల్లిదండ్రులు మిలిటరీ వైద్యులు గా ఉండడంతో అమెరికాలో చుట్టాల దగ్గర ఉంచి పెంచారట. అలా అమెరికాలో స్కూల్ కి వెళ్ళిన సమయంలో ప్రియాంక రంగును చూసి చాలామంది స్కూల్ ఫ్రెండ్స్ ఎగతాళి చేశారట. ఇంత నల్లగా ఉన్నావ్ నువ్వు వెంటనే ఇక్కడి నుండి మీ దేశానికి వెళ్ళిపో అని అవమానించారట. 

దాంతో ఎంతో కృంగిపోయిన ప్రియాంక చోప్రా వారందరికీ కనిపించకుండా దాక్కోవాలని అనుకునేదట. అంతేకాదు కేఫిటేరియా కూడా ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వెండింగ్ మిషన్ దగ్గరకి వెళ్లి ఫుడ్డు కొనుక్కొని వాష్ రూమ్ కి వెళ్లి ఎవరికీ కనిపించకుండా తినేదట.అలా తనకు తెలిసిన ఒకరిద్దరూ ఫ్రెండ్స్ తో తప్ప మిగిలిన ఎవరితో కూడా కలిసేది కాదట. అంతేకాదు వారు చేసిన అవమానానికి ఎంతో రిగ్రెట్ గా ఫీల్ అయ్యేదట. అంతేకాదు డిప్రెషన్ నుండి బయటపడడానికి కౌన్సెలింగ్ కూడా తీసుకుందట.అయితే అలాంటి ప్రియాంక చోప్రా చివరికి  ప్రపంచ సుందరిగా కిరీటాన్ని గెలుచుకుంది.

అయితే మొదట ఈ అందాల పోటీలకు వెళ్లాలని ప్రియాంక చోప్రా అనుకోలేదట.ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలనుకుందట. కానీ చివరికి తనకి తెలియకుండా తన తల్లి అందాల పోటీలకి ఫోటో పంపించిందట. అలా ఎంతోమంది నల్లగా ఉన్నావని అసహ్యించుకున్న ప్రియాంక చోప్రా చివరికి మిస్ వరల్డ్ అయ్యింది. అలా తాను జాతి వివక్షను ఎదుర్కొన్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: