తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. అందులో యంగ్ హీరోయిన్లు రోజురోజుకీ సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ అనన్య నాగళ్ళ ఒకరు. ఈ భామ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో మొదట షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అనంతరం మల్లేశం సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో గుర్తింపు అందుకున్న ఈ చిన్నది ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకిల్ సాబ్ సినిమాలో నటించి ప్రతి ఒక్కరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. 

సినిమా అనంతరం ప్లే బ్యాక్, ఊర్వశివో రాక్షసివో, పొట్టేల్, శాకుంతలం, తంత్ర, డార్లింగ్, శ్రీకాకుళం, షేర్లాక్స్ హోమ్స్ వంటి అనేక సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. ప్రస్తుతం అనన్య చేతినిండా సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. అనన్య నాగళ్ళ తెలుగుతో పాటు అనేక భాష సినిమాలలో నటిస్తుండడం విశేషం. అనన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోనూ తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి హాట్ టాపిక్ గా మారుతాయి.

వరుసగా ఫోటోషూట్లు చేస్తూ తన అందాలను ఆరబోస్తోంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం అనన్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. అందులో అనన్య ఓ సినిమాలో నటిస్తున్న సమయంలో అందులో ఉండే హీరోకు లిప్ లాక్ ఇచ్చింది. ఆ వీడియోలు చూసిన చాలా మంది నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించి కెరీర్ పాడు చేసుకోవడం అవసరమా అని ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తేనే సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. దీనిపైన అనన్య నాగళ్ళ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: