మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీతో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మకు మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయం రావడంతో ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. ఈమె తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వీరి వివాహ బంధం కొన్ని సంవత్సరాలు అద్భుతంగా ముందుకు సాగింది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ వీరు పరస్పర అంగీకారంతో కొంత కాలం క్రితం విడిపోయారు. ఇకపోతే సమంత , నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత రాజ్ నిడిమోరు తో డేటింగ్ చేస్తుంది అని , అతన్ని వివాహం కూడా చేసుకోబోతుంది అని అనేక వార్తలు వైరల్ అయ్యాయి. కానీ సమంత ఎప్పుడూ వీటిపై పెద్దగా స్పందించలేదు. ఇకపోతే తాజాగా సమంత శుభం అనే సినిమాను నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ సక్సెస్ మీట్ ను తాజాగా మేకర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శుభం సినిమాలో నటించిన మధుమణి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా మధుమణి శుభం సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ ... ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన సమంతకు శుభం. రాజ్ తో కలిసి మీరు ప్రయాణం మొదలుపెట్టారు. ఎప్పటికీ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ ఆమె వారిని ఆశీర్వదించింది. తాజాగా మధుమణి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: