
కొన్ని కొన్ని సార్లు మనం మాట మాట్లాడే పద్ధతి మన బిహేవియర్ మనల్ని ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ గా ఉన్నాక కొంచెం ఆచి తూచి మాట్లాడాలి . ఆఫర్స్ ను మంచిగా రాబట్టుకోగలగాలి. ఏ మాత్రం తేడా కొట్టిన సరే కెరియర్ ఫ్లాప్ అయిపోవడం ..మనం మన చేతులారా చేసుకున్న పనే అవుతుంది . అలాంటి ఒక చెత్త పని చేసే సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోల్లింగ్ కి గురైయ్యాడు నాగచైతన్య . నాగార్జున అనగానే నాగచైతన్య - అఖిల్ ఇద్దరు గుర్తొస్తారు.
నాగచైతన్య ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోగా నిలదుకుపోవడానికి ట్రై చేస్తున్నాడు. అఖిల్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక హిట్ కొట్టలేకపోతున్నాడు . అయితే గతంలో ఓ సినిమా విషయంలో అఖిల్ తీసుకున్న డెసిషన్ ఆయనను ఒక ఫ్లాప్ నుంచి కాపాడింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మరొక్కసారి ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే నాగచైతన్య చాలా చాలా మొహమాటస్తుడు . ఎవరు ఏది చెప్పినా వింటాడు . ఎవరు ఏది చెప్పిన నమ్మేస్తాడు . నో అంటూ నోరు తెరిచి చెప్పలేడు. అంత అమాయకుడు అని అక్కినేని ఫ్యాన్స్ చెప్తూ ఉంటారు .
అమీర్ ఖాన్ తో " లాల్ సింగ్ చద్దా" సినిమా టైంలో నాగచైతన్య సైలెంట్ గా ఉండటమే ఆయనకు బిగ్ మైనస్ గా మారిపోయింది . ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా పరమ చెత్త టాక్ అందుకుంది . నాగచైతన్యకి నెగిటివ్ మార్కులు పడేలా చేసింది . నిజానికి ఈ సినిమాలో అఖిల్ ని అనుకున్నారట మూవీ మేకర్స్ . అఖిల్ ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అంటూ ఫిక్స్ అయ్యారట . కానీ అఖిల్ మాత్రం సున్నితంగా నాకంటే ఈ క్యారెక్టర్ అన్నయ్య కి బాగుంటుంది అని అన్నయ్యను ఈ రోల్ లో చూపించండి అంటూ నెమ్మదిగా ఈ క్యారెక్టర్ నుంచి తప్పుకునేసారట .
ఎందుకంటే అఖిల్ కి అప్పటికే తెలుసు ఈ క్యారెక్టర్ అంత పెద్ద క్లిక్ అవ్వదు అని . అఖిల్ ఏదైనా సైలెంట్ గా తప్పించుకునేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు . తన సేఫ్ జోన్ లోకి తాను వెళ్ళిపోతాడు . కానీ నాగచైతన్య మాత్రం తండ్రి పరువు అంటూ ప్లాప్ అవుతుంది సినిమా అని తెలిసిన ఓకే చేస్తూ ఉంటారు . అలా తనకి ఇష్టం లేకపోయినా సరే అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా లో సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేసి బిగ్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు . తమ్ముడు తెలివిగా తప్పించుకుంటే అమాయకుడైన అన్నయ్య అడ్డంగా ఇరుక్కుపోయాడు అంటూ జనాలు అప్పట్లో నాగచైతన్య అమాయకత్వం గురించి మాట్లాడుకున్నారు . కానీ ఇప్పుడు అదే నాగచైతన్య 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా "తండేల్" లో నటించి హిట్ అందుకున్నాడు. అఖిల్ మాత్రం ఇంకా ఒక హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు..!