
హరిహర వీరమల్లు, టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ... బాంబు పేల్చారు. దీనికోసం పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అవసరమా..? రాసి పెట్టుకో ఈ సినిమా అట్టర్ క్రాఫ్ట్ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్ ను ఉద్దరిస్తారనుకుంటే .. థియేటర్ యజమానులు జైల్లో వేయిస్తామని తన మంత్రితో బెదిరిస్తారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు? ఇప్పుడేం చేస్తున్నారు అని నిలదీశారు. ఇవి దివాలాకోరు రాజకీయాలు కావా..? అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సినిమా వాళ్ళని బెదిరించడానికి మీరెవరు... అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. అసలు సినిమా వాళ్ళ సమస్యలు ఏంటో మీకు తెలుసా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. అయితే వీరమల్లు సినిమా వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే వైసీపీ నేతలు రంగంలోకి దిగడంతో... జనసేన అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు.