రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ అబార్షన్ గురించి మాట్లాడుతూ అబార్షన్ చేయిస్తున్నారు అని అందరిని షాకింగ్ కి గురి చేసింది.మరి ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ కి అబార్షన్ ఎవరు చేయించారు.. ఆమె మాట్లాడింది దేని గురించి అనేది ఇప్పుడు చూద్దాం.. రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీని పూర్తిగా పక్కన పెట్టేసింది. అంతేకాకుండా సౌత్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా రకుల్ ప్రీత్ సింగ్ కి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడం లేదు.  గతేడాది భారతీయుడు -2 సినిమాతో వచ్చి సౌత్ లో కనుమరుగయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైనటువంటి ఈ ముద్దుగుమ్మ గత ఏడాది అంగరంగ వైభవంగా తాను ప్రేమించిన జాకీ భగ్నానీ ని పెళ్లాడింది.ఇక రకుల్ తో పెళ్లయ్యాక జాకీ భగ్నాని ఓ సినిమాని నిర్మించి అప్పుల పాలయ్యారని రీసెంట్గా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ప్రాపర్టీలు అమ్మినా కూడా అప్పులు తీరడం లేదంటూ ఆయన చెప్పారు. 

దీంతో రకుల్ ప్రీత్ సింగ్ అడుగుపెట్టడంతోనే జాకీ భగ్నాని అప్పుల్లో మునిగిపోయారంటూ కొంతమంది రకుల్ పై నెగటివ్ కామెంట్లు కూడా చేశారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా  ఓ ఇంటర్వ్యూలో సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ..సడన్గా ప్రెగ్నెన్సీ అబార్షన్ గురించి స్పందించింది. రకుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది అబ్బాయిలు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించుకోమని ఎంతో ఈజీగా చెబుతున్నారు.మనకు దెబ్బ తాకి స్కిన్ పైకి లేస్తేనే ఎంతో బాధని అనుభవిస్తాం. అలాంటిది కడుపులో పెరిగే ఒక జీవాన్ని తొలగించడం అంటే ఎంత కష్టంతో కూడుకున్న పని.అలా చేయడం వల్ల ఆ స్త్రీ మానసికంగా శారీరకంగా డిప్రెషన్ లోకి వెళుతుంది.సైన్స్ ప్రకారం చూసుకుంటే ఒక అమ్మాయి కేవలం రెండు మిస్ అబార్షన్ లను మాత్రమే భరించగలదు.

కానీ ఇప్పుడున్న సమాజంలో చాలామంది మగవాళ్ళు అమ్మాయిలకు ఈజీగా నాలుగైదు అబార్షన్ లు చేయిస్తున్నారు.అలా చేయించడం వల్ల స్త్రీ ఎంతో శారీరక వేదనకు గురవుతుంది. అబార్షన్ చేయించుకోండని చాలా ఈజీగా చెబుతున్నారు. కానీ ఆ బాధ ఎలా ఉంటుందో మాత్రం అర్థం చేసుకోవడం లేదు.భర్తలు ఇప్పటికైనా భార్యల మనసులని అర్థం చేసుకుంటే మంచిది అంటూ ప్రెగ్నెన్సీ, అబార్షన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే రకుల్ ప్రీత్ సింగ్ అలా మాట్లాడటంతో చాలామంది నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటూ ఉంటే ఇంకొంత మందేమో రకుల్ అంత బాధగా అబార్షన్ గురించి మాట్లాడిందంటే ఆమెకి కూడా ఇలాంటి అనుభవం ఎదురైందా అని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: