మనకు తెలిసిందే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రజెంట్ చిరంజీవితో సినిమాను ఓకే చేసుకున్నారు . ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ అయిపోయి.  రీసెంట్ గానే ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు అనిల్ రావిపూడి . తనదైన స్టైల్ తో రైమింగ్ తో టైమింగ్ తో నయనతార ని ఇంట్రడ్యూస్ చేస్తూ  ఒక స్పెషల్ వీడియో ని రిలీజ్ చేశారు . ఈ వీడియో అందరినీ అట్రాక్ట్ చేసింది.  అంతేకాదు చిరు-నయన్ ల కాంబో ఎప్పుడు సూపర్ హిట్ .


మరొకసారి వీళ్ళ కాంబో అద్దిరిపోయే రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరై ఉండొచ్చు..?? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . కాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా సెలెక్ట్ అయిపోయింది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఆమె మరెవరో కాదు "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన "మీనాక్షి చౌదరి".  ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అనిల్ రావిపూడి తన లక్కీ బ్యూటీ  మీనాక్షీ ని ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చూస్ చేసుకున్నారట.



ఈ సినిమాలో చిరంజీవి సరసన అంటించబోతుంది మీనాక్షి అంటూ ఓ న్యూ ట్రెండ్ అవుతుంది. చిరంజీవి ఏజ్ కి మీనాక్షి చౌదరి ఏజ్ కి చాలా తేడా ఉంది . మరి అలాంటి బ్యూటీ ని ఎలా చూస్ చేసుకున్నాడు అనిల్..?? అంటూ కొంతమంది నెగటివ్గా మాట్లాడుతుంటే . సినిమా కధా కంటెంట్ ను ఏ విధంగా అయినా నైనా మార్చేస్తాడు అనిల్ రావిపూడి .. ఆ సత్తా ఉంది . కచ్చితంగా వీళ్ళిద్దరి కాంబో మంచి హిట్ అందుకుంటుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. చూడాలి మరి వీళ్ళ కాంబో ఎంతవరకు సెట్ అవుతుంది అనేది..??

మరింత సమాచారం తెలుసుకోండి: