బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో సల్మాన్ ఖాన్ ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు . ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుకు వస్తున్నాయి. కొంత కాలం క్రితం సల్మాన్ "టైగర్ 3" అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కంటే ముందు టైగర్ సిరీస్ లో వచ్చిన రెండు మూవీలు కూడా మంచి విజయాలు సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కొంత కాలం క్రితం సల్మాన్ ఖాన్ "సికిందర్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన తదుపరి మూవీ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సల్మాన్ ఖాన్ తన తదుపరి మూవీ ని ఓ మలయాళ దర్శకుడితో చేయాలి అని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ మలయాళ దర్శకుడు అయినటువంటి మహేష్ నారాయణన్ దర్శకత్వంలో సల్మాన్ తన తదుపరి సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సల్మాన్ , మహేష్ మధ్య కథ చర్చలు జరుగుతున్నట్లు , మహేష్ చెప్పిన కథ కనుక సల్మాన్ కు బాగా నచ్చినట్లయితే వీరిద్దరి కాంబోలో మూవీ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి సల్మాన్ తదుపరి మూవీ మలయాళ దర్శకుడు అయినటువంటి మహేష్ తో ఉంటుందా లేక వేరే ఏదైనా దర్శకుడితో ఉంటుందా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: