మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే మరో రెండు నెలల వరకు ఈ సినిమా నుంచి అప్ డేట్ ఆశించడం కూడా వేస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆగష్టు నెల 9వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.
 
సాధారణంగా మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజు కాగా ఆరోజు ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబుకు జోడీగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. అయితే ప్రియాంక చోప్రా ఎంపిక విషయంలో సైతం అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలుస్తోంది.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా మహేష్ తర్వాత సినిమా కోసం ముగ్గురు డైరెక్టర్లు రేసులో ఉన్నారని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ తో పాటు బుచ్చిబాబు మహేష్ తో సినిమా తెరకెక్కించాలని ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు డైరెక్టర్లలో మహేష్ తో సినిమా తెరకెక్కించే దర్శకుడు ఎవరనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహేష్ బాబు భవిష్యత్తు సినిమాలన్నీ అంచనాలకు మించి హిట్ గా నిలవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తాయేమో చూడాలి. మహేష్ పుట్టినరోజున వచ్చే అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవడం ద్వారా బాక్సాఫీస్ వద్ద తన ముద్ర వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: