ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా పేరు ఎలా మారు మ్రోగిపోయిందో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ప్రభాస్ "స్పిరిట్" సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొణె ను అనుకున్నారు అని.. ఆమె మితిమీరిన రెమ్యూనరేషన్ అడగటంతో సందీప్ ఆమెని తప్పించారు అని .. ఆ కోపంతో దీపిక పదుకొనే తన పిఆర్ టీం తో స్పిరిట్  సినిమా మొత్తం లీక్ చేసేసింది అంటూ వార్తలు వినిపించాయి . దీనికి తగ్గట్టే సోషల్ మీడియా వేదిక ఘాటుగా ఇచ్చి పడేసాడు సందీప్ రెడ్డివంగా . "నన్ను ఏం పీకలేరు..నాకు ఫరక్ కూడా పడదు" అనే రేంజ్ లోనే ట్వీట్ చేశాడు.


దానికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది దీపికా పదుకొనే.  ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో వీళ్ళ ఇద్దరి పేర్లు ట్రెండ్ అయ్యాయి. అయితే ఇప్పుడు సందీప్ రెడ్డివంగకు సంబంధించిన ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో అనిమల్ సినిమా విషయంలో ఆయన చేసిన తప్పు కారణంగా ఓ హీరోయిన్ కి సారీ చెప్పాడు . ఆ విషయాన్ని మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . నిజానికి అనిమల్ సినిమాలో హీరోయిన్గా పరిణితి చోప్రాని అనుకున్నారు సందీప్ రెడ్డివంగా . ఆమెతో కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు .



అయితే కొన్ని సీన్స్ అయిపోయిన తర్వాత సందీప్ రెడ్డి ఈ "గీతాంజలి" పాత్ర కోసం పరిణితి చోప్రా సూట్ అవ్వడం లేదు అంటూ ఆమెను మధ్యలో సినిమా నుంచి తీసేసారు.  అయినా పరిణితి చోప్రా ఏమీ అనలేదు.  సైలెంట్ గా కామ్ గా అయిపోయింది.  ఆ విషయంలో తప్పు నాదే అని సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమెకు సారీ చెప్పాడు . దీపికా పదుకొనే ఇష్యూ కారణంగా మరొకసారి ఆ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో సందీప్ రెడ్డివంగా పేరు మారు మ్రోగిపోతుంది . తప్పు చేస్తే సారీ చెప్తాడు ..హద్దులు మీరితే తాట తీస్తాడు ..అదే సందీప్ రెడ్డివంగా క్యారెక్టర్ అంటూ ఓ రేంజ్ లో ప్రశంసించేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: