కొంతమంది హీరోయిన్లు అవకాశాలు రావడం కోసం ఎలాంటి సన్నివేశంలో అయినా నటించడానికి ఒప్పుకుంటారు. ఇక ఎలా అయినా అవకాశం రాబట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళయితే డైరెక్టర్ ఎలాంటి అభ్యంతరకరమైన సీన్ చెప్పినా కూడా అందులో చేయడానికి ఒప్పుకుంటారు. అయితే కొంతమంది అవసరం లేదులే అనుకున్న హీరోయిన్లు రిజెక్ట్ చేస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి..అలాంటి సీన్ చేసిన ఏకైక హీరోయిన్ అనే ప్రత్యేకత ఉండాలి అంటే కచ్చితంగా సీన్ చేయాలి అని మరికొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉంది. ఆ హీరోయిన్ సినీ చరిత్రలో ఇలాంటి సీన్ ఏ హీరోయిన్ ఎప్పుడు చేయలేదు.. భవిష్యత్తులో కూడా చేయదు  అనే విధంగా ఆ సీన్ చేసి పేరు తెచ్చుకోవాలి అనుకుంది.

 మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే హిందీ నటి జాన్కీ బోడివాలా..పలు సినిమాలు చేస్తూ హిందీలో యాక్ట్రెస్ గా రాణిస్తున్న జాన్కి బోడివాలా ఓ సినిమాలో ఏకంగా కెమెరా ముందే టాయిలెట్ పోసే సీన్ చేయడానికి రెడీ అయిందట. అయితే ఈ సీన్ చేస్తే తన పరువు ఏమైపోతుంది అనేది కూడా ఆలోచించకుండా ఈ సీన్ చేస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం ఎప్పటికి నన్ను గుర్తు పెట్టుకొని చరిత్రలో నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అని నిర్ణయించుకుందట.దాంతో డైరెక్టర్ చెప్పడంతోనే ఈ సీన్ చేయడానికి ఒప్పుకుందట. ఇక విషయంలోకి వెళ్తే.. గుజరాత్ లో వచ్చిన వశ్ అనే హార్రర్ ఫిల్మ్ ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నారట దర్శకుడు కృష్ణదేవ్..

అలా ఈ సినిమాని హిందీలో షైతాన్ పేరుతో తీయాలని కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిపారు. అలాగే ఈ సినిమాలో చేసే జాన్కి బోడివాలాకి కెమెరా ముందు యూరిన్ కి వెళ్లే సన్నివేశం చేయాలని చెప్పడంతో ఆమె కూడా ఒప్పుకుందట. అయితే అన్ని పూర్తయి సినిమా షూటింగ్ సగం వరకు వచ్చాక కొన్ని అనుకోని కారణాలవల్ల సినిమా షూటింగ్ మొత్తం పూర్తికాకుండానే పక్కన పెట్టేసారట. అలా ఈ సినిమాలో కెమెరా ముందు యూరిన్ పోసే సన్నివేశం ఒప్పుకున్న జాన్కీ బోడివాలా రీసెంట్గా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి ఒక సన్నివేశంలో నేను చేయడానికి ఒప్పుకున్నాను.కానీ సినిమా మధ్యలోకి వచ్చి ఆగిపోయింది. దాంతో ఈ సీన్ నేను చేయలేకపోయాను అంటూ జాన్కీ బోడివాలా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: