ఏంటి ఎన్నో రోజుల నుండి అన్యోన్యంగా తమ బ్యానర్ ని ముందుకు తీసుకు వెళ్తూ ఎన్నో హిట్ సినిమాలను అందించిన బన్నీ వాస్ గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి తప్పుకుంటున్నారా.. గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి వేరుపడి బన్నీ వాసు కొత్త బ్యానర్ పెడుతున్నారా.. ఇంతకీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. చాలా సంవత్సరాల నుండి గీత ఆర్ట్స్ లో నిర్మాత బన్నీ వాస్ భాగం అయ్యారు అనే సంగతి మనకు తెలిసిందే. గీత ఆర్ట్స్ లో అల్లు అరవింద్ సమర్పన్లో బన్నీ వాసు ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇండస్ట్రీకి అందించారు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్నాయి.అలా ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజ బ్యానర్స్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ కూడా ఒకటి. అయితే అలాంటి దిగ్గజ బ్యానర్ గీత ఆర్ట్స్ వేరుపడి బన్నీ వర్క్స్ అనే కొత్త బ్యానర్ ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

అయితే ఈ మధ్యనే బన్నీ వర్క్స్ అనే బ్యానర్ పేరు మీద ఒక కొత్త సినిమాని కూడా చేస్తున్నారట నిర్మాత బన్నీ వాసు.దీంతో ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవ్వడంతో చాలా మంది నెటిజన్లు.నిర్మాత అల్లు అరవింద్ నిర్మాత బన్నీ వాసు ఇద్దరు మధ్య విభేదాలు వచ్చాయని,వీరి మధ్య ఉన్న గొడవల కారణంగానే బన్నీ వాస్ గీత ఆర్ట్స్ నుండి వేరుపడి బన్నీ వర్క్స్ అనే పేరుతో కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే చాలా రోజుల నుండి ఎంతో సన్నిహితంగా ఉంటూ బ్యానర్ ని ముందుకు నడిపించిన బన్నీ వాసు అల్లు అరవింద్ మధ్య గొడవ రావడానికి కారణం అల్లు అరవింద్ బంధువు అయినటువంటి విద్య కుప్పినీడు అని తెలుస్తోంది.ఎప్పుడైతే అల్లు అరవింద్ తమ కంపెనీలోకి విద్యా కొప్పినీడుని తీసుకున్నాడో అప్పట్నుండి ఒకరి నిర్ణయాలు ఒకరికి పొసగక ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయట.

ముఖ్యంగా దర్శకులకు అడ్వాన్స్ ఇవ్వడంలో జాప్యం వహించడంతో కొంతమంది దర్శకులు వేరే బ్యానర్లోకి వెళ్లిపోతున్నారని,గీత ఆర్ట్స్ కొన్ని విషయాల్లో చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే మంచి మంచి సినిమాలు గీత ఆర్ట్స్ నుండి మరో బ్యానర్ లోకి వెళ్లిపోతున్నాయి అని బన్నీ వాస్ అసంతృప్తి వ్యక్తం చేశారట.ఈ కారణంతోనే ఆయన సొంతంగా బన్నీ వర్క్స్ అనే పేరుతో కొత్త బ్యానర్ ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే బన్నీ వర్క్స్ బ్యానర్ స్టార్ట్ చేయడం అల్లు అరవింద్ కి కూడా తెలుసట. ఆయనకు చెప్పాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక మెల్లిమెల్లిగా గీత ఆర్ట్స్ నుండి పూర్తిగా తప్పుకొని బన్ని వాసు తన బ్యానర్ లోనే అన్ని సినిమాలు చేయబోతున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: