
పెద్ది సినిమా షూటింగ్ ఎక్కువగా నైట్ సిన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా భారీ యాక్షన్ సీన్స్ సంబంధించి రామ్ చరణ్ పైన ఒక షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉంటుందని చిత్ర బృందం భావిస్తోందట. ఈ షూటింగ్ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక షెడ్యూల్ ఉండబోతున్నట్లు సమాచారం. వచ్చే నెల జూలై రెండవ వారం నుంచి ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టబోతున్నదట. రామ్ చరణ్, జాన్వీ కపూర్ సిన్స్ ఉండే అవకాశం ఉన్నదట. ఆ తర్వాత ఆమని, జగపతిబాబు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయని సమాచారం.
పెద్ది సినిమాలో ప్రేమ, ఆత్మగౌరవం నేపథ్యంలో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో చాలా ఎమోషనల్ సన్నివేశాలకు పెద్దపీట వేయబోతున్నారని డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు. రంగస్థలం సినిమాకి మించి మరి పెద్ది సినిమా ఉంటుందని ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులు భావిస్తున్నారు. రామ్ చరణ్ సినిమా సక్సెస్ కోసం అడుగుచి బాబు సనా కూడా నైట్ షెడ్యూల్ లో ఎక్కువగా పనిచేస్తున్నారట రామ్ చరణ్ కూడా అందుకు సహకరిస్తూ ఉండడంతో సినిమా షూటింగ్ నీ శర వేగంగా పూర్తి చేస్తున్నారు. మరి ఎలాంటి బ్లాక్ బాస్టర్ అవుతుందో చూడాలి.