ఏంటి సింగర్ కెనీషా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యిందా.. ఇది నిజమేనా.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై కెనీషా ఎలా స్పందించింది..ఇంతకీ కెనీషా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఉన్న వాస్తవం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.. గత కొద్ది రోజుల నుండి జయం రవి ఆర్తిల విడాకుల న్యూస్ వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక సడన్ గా వీరి జీవితంలోకి కెనీషా ఎంట్రీ ఇవ్వడంతో జయం రవి ఆర్తిని వదిలేసి కెనీషాతో డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టు చెప్పిన రవి మోహన్ ప్రస్తుతం కెనీషాతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక ఫ్యామిలీ కోర్ లో ట్ విడాకులు మంజూరు కావడంతోనే కెనీషా జయం రవి పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. 

ఇక రీసెంట్ గా తమిళనాడులోని ఓ గుడికి వెళ్లిన టైం లో వీరిద్దరి మెడలో పూలదండలతో కనిపించడంతో చాలామంది ఈ జంట సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడుకున్నారు. కానీ అది నిజం కాదు.అయితే తాజాగా సింగర్ కెనీషా జయం రవితో డేటింగ్ చేసి పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది.. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ కొన్ని రూమర్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా సింగర్ కెనీషా తన ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.కెనీషా మాట్లాడుతూ.. నాపై ప్రెగ్నెన్సీ వార్తలు ప్రచారం చేసే వారందరికీ చెబుతున్నాను.. నేను ప్రెగ్నెంట్ అంటూ చాలామంది రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.

కానీ నేను ప్రెగ్నెంట్ కాదు.నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది. నిజాలేవో అబద్ధాలేవో త్వరలోనే బయటపడతాయి.అప్పటి వరకు వెయిట్ చేయండి.ఎవరు ఎన్ని రూమర్లు క్రియేట్ చేసినా నాకు ఏమీ కాదు.కర్మ ఎవర్ని వదిలిపెట్టదు. అప్పటివరకు ఇంట్లో మీరు బిర్యాని ప్రశాంతంగా ఉండి తినండి. నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి.. అంటూ సింగర్ కెనీషా ప్రెగ్నెన్సీ వార్తలపై అందరికీ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.కెనీషా ఇచ్చిన క్లారిటీతో ఆమెపై ప్రెగ్నెంట్ వార్తలు వైరల్ చేసిన వారికి గట్టి షాక్ తగిలినట్టు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: