
ఈ పాటను థమన్, భాస్కర భట్ల కేవలం 12 నిమిషాల్లోనే పూర్తి చేశారట. వినడానికి వింతగా ఆశ్చర్యంగా అనిపించినా ఒక ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. బిజినెస్ మెన్ సినిమా షూట్ కోసం గోవా వెళ్లామని సినిమాలో మెలోడీ ఉంటే బాగుంటుందని పూరీకి చెప్పగా ఆయన ఓకే అన్నారని 10 నిమిషాల తర్వాత పూరీ జగన్నాథ్ ట్యూన్ లిరిక్స్ విని పాట నచ్చిందని చెప్పారని రామ్ గోపాల్ వర్మ ఇలాంటి సినిమాలో ఈ పాట అవసరమా అనడంతో పూరీ జగన్నాథ్ మహేష్ బాబును తుది నిర్ణయం తీసుకోవాలని చెప్పారట.
దూకుడు మూవీ 100 డేస్ ఫంక్షన్ లో మహేష్ బాబు ఈ పాట విని మైండ్ బ్లోయింగ్ అని అన్నారని మహేష్ నిర్ణయం ప్రకారం సినిమాలో ఈ పాటను అలాగే ఉంచేశామని థమన్ చెప్పుకొచ్చారు. బిజినెస్ మెన్ సినిమాకు ఈ సాంగ్ ప్లస్ అయిందని థమన్ కామెంట్లు చేశారు. ఈ సాంగ్ వల్ల తమకు బాగా ఆదాయం వచ్చిందని ఆడియో కంపెనీ ప్రతినిధులు చెప్పారని థమన్ తెలిపారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు