టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చాలా కాలం క్రితమే బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడగా ఈ సినిమా వేర్వేరు కారణాల వాళ్ళ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ భవిష్యత్తులో కెరీర్ పరంగా గ్యాప్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ కు ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. త్రివిక్రమ్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువనే సంగతి తెలిసిందే.

జులై నెల నుండి త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.  ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. గతంలో  అఆ  సినిమాకు మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసి ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించారు. వెంకటేష్ సినిమా బడ్జెట్ పరిమితుల దృష్ట్యా త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా తర్వాత చరణ్ తో ఒక సినిమా తారక్ తో మరో సినిమా తెరకెక్కించేలా త్రివిక్రమ్ ప్రణాళికలు ఉన్నాయని తెలుస్తోంది.

వెంకీ త్రివిక్రమ్ కాంబో మూవీ హిట్టైతే  మిక్కీ జే మేయర్ కు మరికొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్  ఇండస్ట్రీలో తిరుగులేనట్టేనని చెప్పవచ్చు. అతి త్వరలో త్రివిక్రమ్ భవిష్యత్తు ప్రణాళికల గురించి  మరింత స్పష్టత వచ్ఛే అవకాశాలు అయితే ఉన్నాయి.  త్రివిక్రమ్ శ్రీనివాస్ భవిష్యత్తులో పాన్ ఇండియా స్థాయి విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్న సంగతి తెలిసిందే.  కార్తికేయుడి కథాంశంతో  ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ తెరకెక్కనుంది.

అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా కావడంతో  ఈ ప్రాజెక్ట్ పై  అంచనాలు పెరుగుతున్నాయి.  హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించే ఛాన్స్ అయితే ఉంది. త్వరలో అధికారికంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.  ఎన్టీఆర్ అభిమానులు సైతం  తారక్ ఖాతాలో మరిన్ని  రికార్డులు చేరాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: