
నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకుని ప్రస్తుతం సంతోషంగా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. చైతన్య, శోభిత విమర్శలకు తావివ్వకుండా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నాగచైతన్య ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత రెండో పెళ్లి గురించి కొన్ని వార్తలు వైరల్ కాగా ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పటికే తేలిపోయింది.
నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. తండేల్ సినిమాతో నాగచైతన్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు. సమంత శుభం సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకున్నారు. సమంత భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. నాగ ఛైతన్య, సమంత పారితోషికాలు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే.
నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ సినిమాకు విచిత్రమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. చైతన్య కార్తీక్ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్క అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. చైతన్య రేంజ్ సైతం అంతకంతకూ పెరుగుతుండగా ఈ హీరో భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. చైతన్య మరిన్ని విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాగచైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.