
అనిల్ రావిపూడి ఎంత బాగా సినిమాలు తెరకెక్కిస్తారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ ఒక్కటే కాదు అంతకుముందు తెరకెక్కించిన భగవంత్ కేసరి అంతకుముందు తెరకెక్కించిన ఎఫ్2 ఎఫ్3 సినిమాలు జనాలను బాగా ఆకట్టుకున్నాయి . అయితే అనిల్ రావిపూడి ఏ హీరో కైనా వెళ్లి కథ చెప్తే ఆ హీరో కచ్చితంగా ఆ కథను ఓకే చేసేస్తాడు . అంత పక్కా క్లారిటీతో చెప్తాడు అంటూ ఆయనతో వర్క్ చేసిన హీరోలు చాలా సందర్భాలలో బయటపెట్టారు . అయితే ఓ హీరో మాత్రం అనిల్ రావిపూడి కథ చెప్పిన రిజెక్ట్ చేశాడు. దానితో ఆ సినిమా వేరే హీరో ఖాతాలో పడి ఆ హీరో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆయన మరెవరో కాదు "రవితేజ" . మాస్ మహారాజా రవితేజ - అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సినిమా "రాజా ది గ్రేట్". ఈ సినిమా టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇప్పటివరకు రవితేజ టచ్ చేయని కాన్సెప్ట్ కానీ అభిమానులను బాగా ఆకట్టుకునింది . నిజానికి ఈ పాత్రలో ముందుగా రామ్ పోతినేని అనుకున్నారట. ఆయనకి కధ విపరీతంగా నచ్చిందట . కానీ బ్యాక్ టూ బ్యాక్ మాస్ పాత్రలు వద్దు అంటూ రిజెక్ట్ చేశారట . అయితే రాం పోతినేని కోసం రాసుకున్న కథను కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ రవితేజకు వివరించాడట . రవితేజ కి కథ నచ్చడం.. ఆయన ఓకే చేయడం.. త్వరగా తెరకెక్కించడం ..రిలీజ్ అవ్వడం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అన్ని చకచకా జరిగిపోయాయి . ఆ టైంలో చాలామంది రామ్ ది బ్యాడ్ లక్ అని ..మాస్ మహారాజా రవితేజ ది గుడ్ లక్ అని చాలా చాలా గట్టిగాట్రోల్ చేశారు. అయితే రామ్ పోతినేని రాజా ది గ్రేట్ సినిమా హిట్ అయిన తర్వాత స్వయంగా అనిల్ రావిపూడి కి కాల్ చేసి మరి అప్రిషియేట్ చేశారట..!