సినిమా ఇండస్ట్రీ లో మంచి అందం , అభినయం , నటన ప్రావీణ్యం ఉన్న వారికి మంచి అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ శాతం విజయాలు ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది విశ్వాసిస్తూ ఉంటారు. కానీ ఓ ముద్దు గుమ్మ కి మంచి అందం , అభినయం , నటన ప్రావీణ్యం ఉన్నా కూడా ఒకే ఒక చిన్న కారణంతో ఆమెను సినిమాలో తీసుకోలేదట. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ఆమె అందుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.

ఇంతకు ఒకే చిన్న కారణంతో సినిమా అవకాశాన్ని కోల్పోయిన ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్. ఈమె 2019 వ సంవత్సరం విడుదల అయిన దొరసాని మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా ద్వారా ఈమెకి నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమె పలు సినిమాలలో నటించింది. కానీ ఈమెకు పెద్ద స్థాయి కమర్షియల్ విజయాలు దక్కలేదు. 

కానీ ఈమె పర్వాలేదు అనే స్థాయి అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను మంచి దశలోనే ముందుకు సాగిస్తుంది. తాజాగా శివాత్మిక ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈ మాట్లాడుతూ కెరియర్ ప్రారంభ దశలో నాకు ఓ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ నాకు ఇన్ స్టా ల ఎక్కువ మంది ఫాలోవర్స్ లేరు అని నన్ను ఆ సినిమాలో తీసుకోలేదు. అలాగే ఇన్ స్టా లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న కొంత మంది కి హీరోయిన్లుగా అవకాశం ఇచ్చారు అని కూడా ఆమె పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: