పెళ్లి సందD సినిమా తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీలీల తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా వరుస సినిమాలు చేస్తుంది .. అయితే నిజానికి ఆమెకు ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయో అన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి .. కానీ ఆమె డిమాండ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు .. ఎప్పటికప్పుడు భారీగా పెరిగిపోతుంది . ఇక ఇప్పుడు ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది .. తాజాగా బాలీవుడ్ అవకాశాలు వస్తున్న క్రమంలో ఈమె ఇప్పుడు మరోసారి రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తుంది .. తాజా సమాచారం మేరకు శ్రీ లీల ఏకంగా రూ. 7 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. తెలుగులో నటించే హీరోయిన్ కి ఇంత రెమ్యూనరేషన్ అంటే చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాలి .


అయితే బాలీవుడ్ నిర్మాతలు శ్రీలీలకు ఆ మొత్తం ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడ‌డం లేదని కూడా అంటున్నారు .. ఈ క్రమంలోని ఆమె రెమ్యూనరేషన్ భారీగా పెంచిందని .. అయితే ఆమెకు 7 కోట్లు ఇవ్వడానికి తెలుగు నిర్మాతలు ప్రస్తుతం రెడీగా లేరు . తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె ఇప్పటివరకు రెండున్నర కోట్లు ఒక్కో తెలుగు సినిమాకి అందుకుంది .. అలాగే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కోసం మూడు కోట్లు అందుకుంది .. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు రావటం తో రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది ఏకంగా 7 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తుంది .  ఇది ఒకరకంగా అఖిల్ లెనిన్ సినిమా నుంచి కూడా బయటకు వచ్చేయడానికి ఇది కూడా ప్రధాన కారణమని అంటున్నారు ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: