
టాలీవుడ్ సీనియర్ హీరో , నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 - తాండవం. బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అఖండ కు సీక్వెల్ గా వస్తోన్న అఖండ 2 పై కనీవినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ అవైటెడ్ సినిమా గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తుండగా ... రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. అయితే అఖండ 2 షూటింగ్ పై ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
రీసెంట్ గా వచ్చిన టీజర్ అఖండ 2 పై అంచనాలు పెంచేసింది. ఇప్పుడు ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ యూపీ లోని ప్రయాగ రాజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఇక్కడ దాదాపు రెండు వారాలు అలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇలా దాదాపు అఖండ 2 - తాండవం షూటింగ్ మొత్తం ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతోందంటున్నారు. ఈ సినిమా రిలీజ్ ని సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే కన్ ఫార్మ్ చేశారు. అఖండ 2 సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా .. 14 రీల్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు