
ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్ అన్ని కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ట్రైలర్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారన్నట్లుగా వార్తలు వినిపిస్తున్న ఇలాంటి నేపథ్యంలో డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ చిత్రంలోని బాబీ డియోల్ పాత్ర పైన చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో భాగంగా బాబీ డియోల్ పైన కొన్ని సన్నివేశాలు షూటింగ్ చేశాక యానిమల్ సినిమాలో ఆయన యాక్టింగ్ ను చూసి , హరిహర వీరమల్లు సినిమాలోని బాబీ డియోల్ పాత్రను పూర్తిగా రీరైట్ చేయాలని ఫిక్స్ అయ్యాను అందుకే రీ డిజైన్ చేసి మరి ఆయన పాత్రను పూర్తిగా మార్చానని తెలిపారు.
యానిమల్ చిత్రంలో బాబీ డియోల్ యాక్టింగ్ సూపర్ గా ఉందని అందులో ఆయన చూపించిన భాగోద్వేగమైన సన్నివేశాలను చూసి ఆశ్చర్యపోయాను అందుకే హరిహర వీరమల్ల చిత్రంలో ఈయన పాత్ర కీలకంగా ఉంటుందని తెలిపారు. ఆయన పాత్రకు అనుగుణంగానే ఔరంగజేబు పాత్రను ఆకర్షించే విధంగా చేశామని తెలిపారు జ్యోతి కృష్ణ. ఆయనకు సంబంధించి స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యారని తెలిపారు. వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని తెలిపారు జ్యోతి కృష్ణ. మరి అభిమానులను ఏ విధంగా బాబీ డియోల్ పాత్రమెప్పిస్తుందో తెలియాలి అంటే జులై 24వ తేదీ వరకు ఆగాల్సిందే.