- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

జూన్ నెల బాక్సాఫీస్ ఓ పెద్ద సినిమాతో మొదలై మరో పెద్ద సినిమాతో ముగిసింది. పైగా తక్కువ సినిమాలు వచ్చాయి. జూలై నెలలో కూడా టాలీవుడ్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది. నితిన్ తమ్ముడు సినిమాతో జూలై బాక్సాఫీస్ మొదలు కాబోతోంది. దిల్ రాజు నిర్మాత .. వేణు శ్రీరామ్ దర్శకుడు కావడంతో అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తమ్ముడు తో పాటు సిద్ధార్థ నటించిన త్రీ బి హెచ్ కే సినిమా ఈవారం ధియేటర్లలోకి వస్తోంది. రెండోవారం అనుష్క ఘాటీ సినిమా విడుదల కావాలి . .  కానీ ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇక రెండోవారం సుహాస్ ఓ భామ‌ అయ్యో రామ సినిమాతో వస్తున్నాడు. మూడో వారంలో ప్రస్తుతానికి మేఘాలు చెప్పిన ప్రేమ కథ - గాలి జనార్దన్ రెడ్డి కొడుకు జూనియర్ సినిమాలకు షెడ్యూల్ అయి ఉన్నాయి.


జూనియర్లో శ్రీలీల హీరోయిన్ . . మరో కీలక పాత్రలో జెనీలియా కూడా .. టీజర్ కు రెస్పాన్స్ రావడం ఈ సినిమాకు ప్లస్. ఇక జూలై నెలకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతుంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా కోసం చాలా రోజులుగా అతడే అభిమానులు ఎదురు చూస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా తమ్ముడు - జూనియర్ - వీరమల్లు సినిమాలపై ఈ నెలలో కాస్త అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలు థియేటర్లను ఎంతవరకు కాపాడతాయో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: