పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస‌ సినిమాలతో బిజీగా ఉన్నారు .. అయితే ఆయన చేస్తున్న సినిమాలతో ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా లేక దర్శక నిర్మాతలను కన్ఫ్యూజ్ లో పడుతున్నారా ? లేక ఒకరితో మరొకరికి అసలు కోఆర్డినేషన్ ఉండటం లేదా ? ఈ అనుమానం ఇప్పుడెందుకొచ్చిందబ్బా  .. అసలు ప్రభాస్ విషయం లో జరుగుతున్న ఈ కన్ఫ్యూజన్ ఏంటి అని అనుకుంటున్నారా  కదా .  అసలు విషయం ఏంటో ఈ ఈ ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీలో తెలుసుకుందాం . సినిమాలు అనుకున్న టైం కి వచ్చిన రాకపోయినా టాలీవుడ్ లో ఎప్పుడు బిజీగా ఉండే హీరో మాత్రం ప్రభాస్ ఒక్కడే .. రెండు సినిమాల్లు షూటింగ్ లు మరో మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో ఎవరికీ దొరకనంత బిజీగా గడుపుతున్నారు ప్రభాస్ ..

అయితే ఈ లైన్ ఆఫ్ విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది .. ముఖ్యంగా వీటిలో ఏది ముందు ఏది తర్వాత అనే విషయంలో మాత్రం మేకర్స్ మధ్య ఎలాంటి క్లారిటీ రావటం లేదు . కరోనా తర్వాత ఒకే సమయంలో రాధే శ్యామ్, సలార్, కల్కి, ఆదిపురుష్ సినిమాలను ఓకే చేశారు ప్రభాస్ .. సెట్స్‌పై ఉన్నప్పుడు ఆ సినిమాల డేట్స్ విషయం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ప్రభాస్ .. అలాగే రిలీజ్ సమయంలో కూడా క్లాష్‌ వచ్చింది.  అందుకే ఇప్పుడు కల్కి విడుదలయ్యాక ఒకసారి ఒక సినిమా మాత్రమే అని ఒక ఆలోచనకు వచ్చి కొన్నాళ్ళుగా హ‌నురాగపూడి సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్ .. ఇలా ఒకే సినిమా చేయాలనుకున్న ఫౌజితో పాటే  రాజా సాబ్‌కు  కూడా ఈ స్టార్ హీరో డేట్స్ ఇవ్వక తప్పలేదు . అయితే ఈ కన్ఫ్యూజన్ ఇక్కడితో ఆగలేదు ..

 

ఇకనుంచి ఒక్కసారి ఒక సినిమాని అంటున్నా కానీ ఈ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు .. రీసెంట్ గానే కల్కి 2 సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని నిర్మాత అశ్వినీద‌త్‌ చెబితే .  తాజాగా స్పిరిట్ కూడా అప్పుడే అంటున్నారు ప్రొడ్యూసర్లు. కల్కి 2 షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుపెట్టి 2026 సమ్మర్ కి రిలీజ్ చేస్తామని ప్రకటించారు అశ్విని దత్ .. అయితే ఇప్పుడు తాజాగా సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ వంగా తమ స్పిరిట్ కూడా సెప్టెంబర్ లోని మొదలు కాబోతుందని అంటున్నారు .. ఇలా ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ దేన్ని ముందు షూటింగ్ కు తీసుకువెళ్తారు ? అసలు వచ్చే సెప్టెంబర్ లోపు సెట్స్ పై ఉన్న  ఫౌజీ, రాజా సాబ్ కంప్లీట్ అవుతాయ‌ అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: