ప్రభాస్ సినిమాలో అవకాశమోస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తూ సినిమాకి ఓకే చెప్తారు. కానీ ఈ సీరియల్ నటుడు మాత్రం అది ఒక చెత్త ఇన్సిడెంట్ నన్ను మోసం చేశారు అంటూ ఏకంగా ప్రభాస్ సినిమాపైనే ఆరోపణలు చేశారు. మరి ఇంతకీ ఆయన ఎవరు..ఎందుకు ప్రభాస్ సినిమా విషయంలో తనకి మోసం జరిగిందంటూ మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ సినిమా వల్ల నాకు మోసం జరిగింది అంటూ చెబుతున్న ఆ  సీరియల్ నటుడు ఎవరో కాదు మొగలిరేకులు ఫేమ్ ఆర్కే సాగర్.. మొగలిరేకులు సీరియల్ బుల్లితెర మీద ఎంత బాగా వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అలాంటి సీరియల్ ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో స్టార్డం సంపాదించారు.వారిలో ఆర్కే సాగర్ కూడా ఒకరు.ఆర్కే సాగర్ హీరోగా నటించిన ది 100 మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమా వల్ల నేను మోసపోయాను.

 అది ఒక చెత్త ఇన్సిడెంట్.. ప్రభాస్ నటించిన Mr.పర్ఫెక్ట్ సినిమాలో నాకు సెకండ్ లీడ్ గా చేసే అవకాశం వచ్చింది. అయితే మొదటి డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ప్రభాస్ తర్వాత నెక్స్ట్ హీరో మీరే.. సెకండ్ లీడ్ అంటూ చెప్పారు. దాంతో మొగలిరేకులు సీరియల్ షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా పెద్ద సినిమా పెద్ద హీరో అని చెప్పేసి మొగలిరేకులు సీరియల్ డైరెక్టర్ నా డేట్స్ కుదించారు. దాంతో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో చేశాను.అయితే తీరా ఈ సినిమాలో నాకు పెద్దగా చోటు లేదనిపించింది. మూడు రోజులు షూట్ చేశారు అంతే.దాంతో డైరెక్టర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం అడిగాను. దానికి డైరెక్టర్ అప్పుడప్పుడు క్యారెక్టర్లు మారిపోతూ ఉంటాయి కాస్త అడ్జస్ట్ చేసుకోండి అంటూ చెప్పారు. ఇక అప్పటికే నాకు అర్థమైంది. ఆ సినిమాలో నాది సెకండ్ లీడ్ కాదని.ఇక వెంటనే ఆ సినిమా నుండి నేను తప్పుకుంటాను.నా సీన్స్ అందులో నుండి తీసేయండి అని చెప్పాను.

అయితే దానికి ఓకే చెప్పిన చిత్ర యూనిట్ నా పాత్ర తీసేశానని అన్నారు.కానీ అక్కడక్కడ నా పాత్ర కనిపించింది.దాంతో సినిమా విడుదలయ్యాక చాలామంది చిత్ర పరిశ్రమలోని పెద్దవాళ్లు ఫోన్ చేసి ఎందుకు అలాంటి పాత్ర చేశారు.పాత్ర ఎంపిక చేసుకునేటప్పుడు మీ ఇమేజ్ దెబ్బ తింటుందని తెలియదా అని బాధపడ్డారు. నా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా వల్ల బాధపడ్డారు.అయితే ఈ సినిమా నుండి పూర్తి సన్నివేశాలు తొలగించమంటే అక్కడక్కడ ఉంచేయడంతో ఈ సినిమా తర్వాత నాకు చాలామంది కాల్ చేసి బాధపడ్డారు. దాంతో నేను ఈ సినిమా చేసినందుకు చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను. అంతేకాదు నా జీవితంలోనే ఒక చెత్త ఇన్సిడెంట్ అంటూ మొగలిరేకులు సీరియల్ ఫేమ్ నటుడు ఆర్కే సాగర్ చెప్పడంతో చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటిది మీరు మాత్రం చెత్త ఇన్సిడెంట్ అంటారా అంటూ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: