
మలయాళ సినిమా పాపులర్ యాక్టర్స్ ఊర్వశి, జోజు జార్జ్ కలిసి క్రేజీ మల్టీ లింగ్వల్ మూవీ ఆశలో నటిస్తున్నారు. అజిత్ వినాయక ఫిల్మ్స్ సమర్పణలో , వినాయక అజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సఫర్ సనల్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్ , రమేష్ గిరిజ , సఫర్ సనల్ సంయుక్తంగా స్క్రీన్ ప్లే, సంభాషణలు రాశారు. త్రిక్కక్కర వామన మూర్తి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది. జోజు జార్జ్ , సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్, దర్శకుడు సఫర్ సనల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. జోజు జార్జ్ క్లాప్ కొట్టగా , మధు నీలకందన్ కెమరా స్విచ్-ఆన్ చేశారు.
ఈ వేడుకలో ఆశ టైటిల్-లుక్ పోస్టర్ లాంచ్ చేశారు, ఇది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజే ప్రారంభమైంది. విజయరాఘవన్, ఐశ్వర్య లక్ష్మి, పాణి సినిమా ఫేమ్ రమేష్ గిరిజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఐదు భారతీయ భాషల్లో పాన్-ఇండియన్ విడుదల కానుంది. ఈ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, ఎడిటింగ్, షాన్ మొహమ్మద్. సంగీతం: మిధున్ ముకుందన్. సౌండ్ డిజైన్, సింక్ సౌండ్ అజయన్ అదత్, ప్రొడక్షన్ డిజైన్ వివేక్ కలథిల్, దినేష్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు