
కథ :
1997 సంవత్సరంలో కొత్తపల్లి అనే మారుమూల గ్రామంలో అప్పన్న (రవీంద్ర విజయ్) వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే అప్పులకు భారీ వడ్డీలు విధించడంతో పాటు అప్పులు చెల్లించని వ్యక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. రామకృష్ణ (మనోజ్ చంద్ర) అప్పన్న దగ్గర పని చేస్తూ ఉంటారు. మనోజ్ బాల్యం నుంచి సావిత్రి (మౌనిక) ను ప్రేమిస్తూ ఆమే ప్రాణంగా జీవిస్తూ ఉంటారు.
సావిత్రి ఉరికి జమిందారు అయిన రెడ్డి (బెనర్జీ) కూతురు కాగా రామకృష్ణ సావిత్రిని పెళ్లి చేసుకోవాలని భావించినా ఊహించని ఇబ్బందులు అతనికి ఎదురవుతాయి. అదే సమయంలో అప్పన్న మరణంతో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటాయి. రామకృష్ణ పెళ్లి ఎవరికీ జరిగింది? అప్పన్న మరణం తర్వాత ప్రజల్లో అతనిపై అభిప్రాయం మారడానికి కారణాలేంటి ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
స్టార్ హీరో కమ్ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి తాను సమర్పించే సినిమాల విషయంలో అభిరుచిని చాటుకుంటారనే సంగతి తెలిసిందే. ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప ఆయన సినిమాలను నిర్మించడానికి ఆసక్తి చూపించారు. కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా స్టోరీ లైన్ మరీ కొత్తది కాకపోయినా కథనం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. 2 గంటల 5 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. కేరాఫ్ కంచరపాలెం నిర్మాతలు ఈ సినిమా ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ఫస్టాఫ్ లో కొన్ని సీన్లు మరీ అద్భుతంగా లేకపోయినా ఆ తర్వాత ఒక్కో సీన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. దర్శకురాలు ప్రవీణ విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకోవడంతో పాటు ఈతరం ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కించే విషయంలో సక్సెస్ అయ్యారు.
సినిమాలోని ప్రధాన నటీనటులలో ఎక్కువమంది కొత్త నటీనటులు అయినప్పటికీ అనుభవం ఉన్న నటులలా నటించారు. మనోజ్ చంద్ర, మౌనిక అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నారు. రవీంద్ర విజయ్ నటన కూడా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నారు. పెట్రోస్ అంటోనియాడిస్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కిరణ్ ఈ సినిమా సక్సెస్ కావడానికి తన వంతు కృషి చేశారు. బాబు మోహన్, బెనర్జీ , మరి కొందరు సీనియర్ నటులు పాత్ర పరిధి మేర మెప్పించారు.
బలాలు : సెకండాఫ్, కామెడీ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే
బలహీనతలు : ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్
రేటింగ్ : 2.75/5.0