హరిహర వీరమల్లు సినిమా టాక్ ఎలా ఉండబోతుందో మరికొన్ని గంటల్లో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. ఈరోజు రాత్రి 9.30 గంటల నుండి మెజారిటీ థియేటర్లలో హరిహర వీరమల్లు ప్రదర్శితం కానుంది. గడిచిన 24 గంటల్లో కేవలం బుక్ మై షో వెబ్ సైట్ లో మాత్రమే ఈ సినిమాకు సంబంధించి 1,57,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. 2 గంటల 43 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

కొన్ని ప్రముఖ మల్టిప్లెక్స్ లలో మాత్రం బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. హరిహర వీరమల్లు నైజాం హక్కులను మైత్రీ నిర్మాతలు సొంతం చేసుకున్నారు. నైజాం ఏరియాలో  మైత్రీ నిర్మాతలకు లోకల్ ప్లేయర్స్ కు టెర్మ్స్ కుదరడం లేదని సమాచారం అందుతోంది. పుష్ప2 మూవీ రిలీజ్ సమయంలో ఇరు పక్షాలు పట్టుదలకు వెళ్లగా  ప్రస్తుతం రెండు వైపులా సమస్య ఉందని తెలుస్తోంది.

సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎవరు వెనక్కు తగ్గుతారనే  చర్చ జరుగుతోంది.  హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ సాధించడం ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు  దర్శకనిర్మాతలకు సైతం కీలకమనే సంగతి తెలిసిందే. మైత్రీ నిర్మాతలు ఈ సినిమా విషయంలో మొండిగా ముందుకెళ్లడం ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని కచ్చితంగా చెప్పవచ్చు.

హైదరాబాద్ లోని ప్రముఖ మల్టిప్లెక్స్ లో ఒకటైన ఏఎంబీ  సినిమాస్ లో కూడా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం  గురించి  నెట్టింట చర్చ జరుగుతోంది.  మైత్రీ నిర్మాతలకు ఆసియన్ థియేటర్స్ తో  ఒప్పందం విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది.  ఈ వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: