
ఇక్కడ మీరు చూస్తున్నది హీరోయిన్ "సాయి పల్లవి". దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్.. ఆమె ఫాలో అయ్యే పద్ధతులు అందరికీ తెలిసినవే. కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకి చాలా చాలా దూరంగా ఉంటూ వచ్చింది సాయి పల్లవి. అప్పుడెప్పుడో మార్చి 25వ తేదీ ఒక పోస్ట్ పెట్టి ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ ను వదిలేసింది . ఇప్పటికి మళ్ళీ ఇన్నాళ్ళకి ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి అభిమానులను పలకరించింది. ఆమె పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
తనకు మనసుకు బాగా నచ్చిన కొన్ని పిక్స్ ని షేర్ చేస్తూ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ లో ఫొటోస్ ని పోస్ట్ చేసింది . ఈ ఫొటోస్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వడంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరపడిపోతున్నారు . ప్రెసెంట్ సాయి పల్లవి బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ ప్రాజెక్టులో భాగం అయ్యింది. అదే విధంగా కోలీవుడ్ లో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!