టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి వాటిలో పవన్ క్రిష్ కాంబినేషన్ ఒకటి. ఈ కాంబోలో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమాలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని సెకండాఫ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని కామెంట్లు వినిపించాయి. హరిహర వీరమల్లు సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

అయితే, సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు, మధ్యలో కొన్ని వార్తలు కూడా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేశాయి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.   'హరి హర వీర మల్లు' ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుండి అనేక కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది.  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం, ఇతర సినిమాల షూటింగ్‌లలో బిజీగా ఉండటం, అలాగే స్క్రిప్ట్‌లో మార్పులు షూట్  ఆలస్యానికి కారణమయ్యాయి.

ఈ ఆలస్యం జరుగుతున్న క్రమంలోనే, పవన్ కళ్యాణ్‌కు, క్రిష్‌కి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, స్క్రిప్ట్ విషయంలో ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఉన్నాయని  కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.  అయితే ఈ వార్తల గురించి దర్శకుడు క్రిష్ స్పందించి  క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.  హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలను త్వరలోనే బయటపెడతానని క్రిష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు సమాచారం.

పవన్ కు, నాకు మధ్య ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ లేవని  క్రిష్ వెల్లడించినట్టు సదరు మీడియా సంస్థ పేర్కొంది.  నేను ఓపెన్ గా ఉన్నానని  భవిష్యత్తులో పవన్ తో కలిసి మరో సినిమా చేయడానికి సిద్ధమేనని ఆయన కామెంట్లు చేశారు.  మొత్తంగా, పవన్ కళ్యాణ్, క్రిష్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు నిరాధారమైనవి అని చెప్పొచ్చు.  అయితే  క్రిష్ రాబోయే రోజుల్లో  హరిహర వీరమల్లు వెనుక అసలు నిజాలను వెల్లడించే ఛాన్స్ అయితే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: