
రాజమౌళితో సినిమా అంటే టైం ఎంత కేటాయిస్తాడు అన్న విషయం అందరికీ తెలుసు . కాగా ఇప్పుడు మహేష్ బాబు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు తన కెరియర్ లో ఓ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోని ఆ సినిమా ఫ్లాప్ అయిన కారణంగా మేకర్స్ కి తిరిగి ఇచ్చేశారట. నిర్మాతకి బాగా భారీ నష్టాలు రావడంతో చలించి పోయిన సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తన రెమ్యూనిరేషన్ మొత్తం వెనక్కి ఇచ్చేశారు. ఆ సినిమా మరేంటో కాదు "సైనికుడు".
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ "సైనికుడు" మూవీ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ అంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ మహేష్ బాబు అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు . పరమ చెత్త ఫ్లాప్ గా నలిచింది. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి..? కాన్సెప్ట్ ఏంటి..? అంటూ మహేష్ బాబు ఎందుకు ఇలాంటి సినిమాని చూస్ చేసుకున్నాడు అని.. కెరియర్ నాశనం చేసుకుంటున్నాడు అంటూ జనాలు రకరకాలుగా ఆయనపై మండిపడ్డారు . ఆ తర్వాత ఆయన తప్పు తెలుసుకొని సైనికుడు లాంటి కాన్సెప్ట్ మూవీని ఇప్పటివరకు తన కెరియర్లో టచ్ చేయలేదు..!!