
ప్రశాంత్ నీల్ చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేశారని, ఇందులోని ప్రతి పాత్రకి బలమైన బేక్‌గ్రౌండ్ ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఎప్పుడూ చూడని విధంగా టెక్నికల్‌గా పర్ఫెక్ట్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారని వివరించారు . ఇంతకీ టాక్ ఎలాంటిది అంటే.. ఈ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మలయాళ యాక్టర్ టొవినో థామస్ పాత్ర సూపర్ స్పెషల్ అని తెలుస్తోంది. ఆయనతో పాటు మరో మలయాళ యాక్టర్ బిజు మీనన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని పృథ్వీరాజ్ తేల్చేశారు. దీంతో టొవినో థామస్ టాలీవుడ్ ఎంట్రీ ఇక అధికారికమైపోయిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇప్పటికే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న టొవినో, తారక్ సరసన ఎలాంటి పాత్రలో మెరవనున్నాడన్నది సస్పెన్స్ అయింది. విలన్ రోల్‌లోనా? లేక ఫ్రెండ్‌గా? లేక మరో పవర్‌ఫుల్ ఛారెక్టర్‌లోనా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి.. ప్రతి పాత్ర కూడా గ్రిప్‌తో, గ్రాండియర్‌తో ఉండే అవకాశముంది . ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ హయ్యెస్ట్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అన్ని భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక టొవినో థామస్ ఎన్టీఆర్ సరసన ఎలా మెరవనున్నాడో తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే!