- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి ముందు టాలీవుడ్ లో ఆ నలుగురు పై చర్చ జోరుగా సాగింది. పరిశ్రమను తమ గుప్పెట్లో పెట్టుకున్నారని తెరవెనక ఇండస్ట్రీని శాసిస్తున్నారు అంటూ చాలా వివాదాలు చెలరేగాయి. అలా వివాదం మొదలైన వెంటనే అల్లు అరవింద్ - ఏషియన్ సునీల్ - దిల్ రాజు - శిరీష్ రెడ్డి లాంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఆ నలుగురులో మేము లేము అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రముఖ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్ వేశారు. బయటకు వచ్చి ఎవరైతే మేము లేమని చెప్పారో ఆ నలుగురే వాళ్ళు అంటూ కామెంట్ చేశారు. మేము లేము అన్న నలుగురే ఆ నలుగురు అనేది తమ్మారెడ్డి చెబుతున్న మాట.


ఇండస్ట్రీలో థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని కొద్ది రోజుల కింద చర్చ నడిచింది. దీనిపై అల్లు అరవింద్ రాజు - ఏషియన్ సునీల్ లాంటి వాళ్ళు అప్పట్లో ప్రకటనలు చేశారు. థియేటర్లు తమ చేతిలో లేవు అని చెప్పారు. అయితే ఈ విషయాలను తమ్మారెడ్డి ఖండిస్తున్నారు. ఇండస్ట్రీ ఇప్పటికీ బ్యాడ్ పోజిషన్ లోనే ఉందని .. కోర్టు - బలగం లాంటి చిన్న సినిమాలు అప్పుడప్పుడు హిట్ అవుతున్న థియేటర్ పరిస్థితులలో మార్పు రావాలని అది జరిగినప్పుడు పరిశ్రమ మునగడ కష్టం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: