ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మరియు విద్యావేత్త మంచు మోహన్ బాబు మరియు ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. 2019లో వారిపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీం కొట్టిపారేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2019 మార్చి 22న తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని నాటి టీడీపీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు ధర్నా నిర్వహించారు.


తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై ఈ ధ‌ర్నా జ‌రిగింది. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మోహ‌న్ బాబుతో పాటు కుమారులు విష్ణు, మనోజ్‌, మరికొందరిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోప‌ణ‌ల కింద చంద్రగిరి పోలీసులు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాల‌ని మొద‌ట మోహ‌న్ బాబు హైకోర్టును కోర‌గా.. న్యాయ‌స్థానం అందుకు నిరాక‌రించింది.


దాంతో ఈ కేసును స‌వాల్ చేస్తూ మోహ‌న్ బాబు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. అయితే జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు  దాఖలు చేసిన అభ్యర్థనను సమర్థించింది. రాష్ట్ర ప్ర‌భుత్వం వారిపై న‌మోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో మోహన్‌బాబు ఫ్యామిలీకి భారీ ఊరిట ల‌భించిన‌ట్లు అయింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: