అలాగే గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా 700 అన్న క్యాంటీన్లను మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు. అదేవిధంగా పేదలకు ఇళ్ల పథకం పైన కూడా ప్రకటించారు. ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కొత్త ఇల్లును లబ్ధిదారులకు అందించే విధంగా ప్లాన్ చేశారు. ఉగాది నుంచి మండల కేంద్రాలలో కూడా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నామని, ఇందుకు సంబంధించి ప్రజల నుంచి ఎమ్మెల్యేల నుంచి వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మొదట సంక్రాంతికి అన్న క్యాంటీన్లను ప్రారంభించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత వాటిని ఉగాదికి పోస్టుపోన్ చేశామని తెలిపారు.
వచ్చే మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇళ్ల లబ్ధిదారుల సర్వేను పూర్తి చేసిన తర్వాత ప్రణాళికలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయబోతున్నట్లు తెలియజేశారు.ప్రస్తుతం గుర్తించిన లబ్ధిదారులే కాకుండా ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నట్లు అయితే వారి సర్వేను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు. అలాగే ఎవరికైనా గృహ నిర్మాణంలో భాగంగా స్థలం కావాలని అడిగితే స్థలం ఇవ్వాలని, అలాగే ఎవరికైనా స్థలాలు ఉంటే వారికి ఇల్లు కట్టుకోవాలనుకుంటే పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తెలియజేశారు. వారి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఆన్లైన్లో ఉంచేలా చూడాలని తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి