సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావడానికి ఎన్ని తిప్పలు పడాలో..? ఎన్ని శాక్రిఫైజులు చేయాలో..? ఎన్ని నొప్పులు భరించాలో..? అందరికీ తెలిసిందే . అయినా సరే కొందరు హీరోయిన్స్ వచ్చిన క్రేజ్ ని  ఫామ్ ని కొన్ని కొన్ని తప్పుడు నిర్ణయాలతో తుడిచిపెట్టుకుపోయేలా చేస్తూ ఉంటారు.  మరీ ముఖ్యంగా ఇప్పుడు రష్మిక చేస్తున్న పని కూడా అందరికీ అలానే అనిపిస్తుంది . రష్మిక మందన్నా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . కాదు కాదు కాదు ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ .


హీరోయిన్ తో సినిమా చేయాలి అంటూ బాలీవుడ్ స్టార్స్ ..కోలీవుడ్ స్టార్స్ ..కన్నడ స్టార్స్ .. తెలుగు స్టార్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు . రష్మిక ఒక సినిమాకి 10 కోట్ల రెమ్యూనరేషన్  తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది . మొదటి సినిమా "చలో"  కోసం కేవలం 50000  రెమ్యూనరేషన్ తీసుకున్న రష్మిక.. ఇప్పుడు 10 - 12 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది అంటే ఆమెలోని టాలెంట్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు . పైగా ఇప్పుడు "మైసా" సినిమాతో మరొక సెన్సేషన్ హిట్ తన ఖాతాలో  వేసుకోవడానికి సిద్ధంగా ఉంది .

 

అయితే రష్మిక మందన్న ఇలాంటి సమయంలోనే ఒక స్టార్ హీరో తో కమిట్ అయిన మూవీ ఆమె పేరుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైయేలా చేస్తుంది. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ "శింబు". శింబు  చేయబోయే తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట . ఆమె కూడా ఇందుకు ఓకే చేసిందట . శింబుతో సినిమా అంటే హీరోయిన్స్ అందరూ భయపడతారు . ఆయనతో సినిమాలో నటిస్తే హిట్ కన్నా కూడా గాసిప్స్ ఎక్కువగా వస్తాయి .. ఖచ్చితంగా ఆయనతో ప్రేమలో పడిపోతారు ..ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ హీరోతో పాటు ఈ హీరోయిన్ పేరు కూడా గబ్బు లేపుతుంది.  చాలామంది హీరోయిన్స్ శింబు ఖాతాలో బలైపోయారు . నయనతార, హన్సిక, నిధి అగర్వాల్ ఇలా ఎంతోమంది హీరోయిన్స్ కెరియర్ లో బిగ్ రూమర్స్ వినిపించడానికి కారణం శింబునే. మరి అలాంటి హీరోతో రష్మిక ఎందుకు సినిమా ఓకే చేసింది ..?? అనేది ఇప్పుడు అందరికీ బిగ్ డౌట్ . దీని గురించే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . రష్మిక ఫ్యాన్స్ అయితే పోయి పోయి వాడితో సినిమా ఎందుకు..?? క్యాన్సిల్ చేసుకో అంటూ సజెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి రష్మిక ఏం చేస్తుందో...??

మరింత సమాచారం తెలుసుకోండి: