నిజానికి సుహాసిని, శృతి హాసన్ అక్కాచెల్లెళ్లు అన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు చారుహాసన్ కుమార్తె సుహాసిని. చారుహాసన్ ఇంకెవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్ కు సొంత అన్నయ్య. కమల్ హాసన్, సారిక దంపతుల కుమార్తె శృతి హాసన్. అన్నతమ్ముళ్ల పిల్లలు కావడంతో సుహాసిని, శృతి హాసన్, అలాగే అక్షర హాసన్ అక్కాచెల్లెళ్లు అవుతారు.
కాగా, చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శృతి హాసన్.. ఆ తర్వాతి కాలంలో హీరోయిన్‌గా మారింది. తొలినాళ్లలో వరుస ఫ్లాపులు, ఎన్నో విమర్శలు ఎదురైన శృతి స్ట్రాంగ్ గా నిలబడింది. 2012లో విడుదలైన `గబ్బర్ సింగ్` మూవీతో స్టార్ హోదాను అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. త్వరలోనే `కూలీ` మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. శృతి చేతిలో `సలార్ 2`తో పాటు పలు తమిళ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి