
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్లాపులకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. విజయ్ అసలు హిట్ కొట్టి ఎన్నేళ్లు అయ్యిందో తెలిసిందే. విజయ్ అభిమానులు కూడా బాగా నిరాశలో ఉన్నారు. ఇక విజయ్ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా కింగ్డమ్. వాస్తవాని కి ఈ సినిమా కు మిక్స్ డ్ టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నే తెలుగు సినిమా కు కీలకం అయిన నైజాం మార్కెట్ లో కింగ్డమ్ మంచి వసూళ్ళతో దూసుకెళ్తుంది.
మొత్తం మూడు రోజుల రన్ ను కంప్లీట్ చేసుకున్న కింగ్డమ్ ఈ మూడు రోజుల్లో నైజాం లో రు. 7.85 కోట్ల షేర్ వచ్చినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. అది కూడా జిఎస్టీ కాకుండా కావడం విశేషం. నిన్న శనివారం కావడంతో నిన్న ఒక్క రోజులోనే 1.8 కోట్ల షేర్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఆదివారం కావడం తో ఈ రోజు కూడా కింగ్‌డమ్ భారీ వసూల్లు రాబడుతుందని లెక్కలు వేస్తున్నా రు. ఇక ఈ ఆదివారం కూడా మంచి వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక విజయ్ నైజాం లో తన స్టామినా ఏంటో మరోసారి కింగ్‌డమ్ సినిమా తో ఫ్రూవ్ చేసుకున్నట్టు అయ్యింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు