
ఈ నేపథ్యంలో వార్ 2 విషయంలోనూ “కంటెంట్ బలమైతే టైమింగ్ అనే అడ్డంకే ఉండదు” అనే ట్రేడ్ వర్గాల విశ్వాసం కనిపిస్తోంది . అయితే ఇదంతా సరే కానీ , వార్ 2 షోలు వేయడమే సేఫ్ కానే ప్రశ్నగా మారింది. ఇది తెలుగు సినిమా కాదు, హిందీ డబ్బింగ్ వెర్షనే. పైగా బాలీవుడ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండేలా ఉన్న సినిమా. తెల్లవారుఝాము షోలు అంటే, సగం ఆడియెన్స్ నిద్రపోయే టైమ్‌లో – అసలు రెస్పాన్స్ ఎలా ఉండబోతుందన్నది పెద్ద ప్రశ్న. పైగా ఓపెనింగ్ రివ్యూలు యావరేజ్ గా ఉంటే, షార్ట్ టైంలోనే నెగటివ్ టాక్ ఓ సెగలా వ్యాప్తి చెందుతుంది. గుంటూరు కారం సినిమాకి ఇలాగే చాలా డ్యామేజ్ అయ్యింది . అంతేకాదు, వార్ 2కి తమిళ్ లో “కూలీ” సినిమా నుంచి పోటీ ఉంది.
అదీ కాకుండా, సౌత్‌లో షోలు ఉత్తరాదితో పోల్చితే 2–3 గంటల ముందే పడిపోతే, ఫస్ట్ ఇంప్రెషన్ ఫలితాన్ని ఆదేశమంతా తడిపేస్తుంది. ఈ కారణంగా యష్ రాజ్ ఫిలిమ్స్ కూడా స్పెషల్ షోలు, టైమింగ్ పై ఆలోచనలో ఉందట. గ్రీన్ సిగ్నల్ ఇప్పటికీ రాలేదు అనేది టాక్. ఈ కష్టకాలంలో వన్ అండ్ ఓన్లీ హోప్ – జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్. వార్ 2ని దేవరలా కాచుకుంటే, ఓ సాలిడ్ బ్లాక్‌బస్టర్ ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ టైమింగ్, టార్గెట్ ఆడియెన్స్, నేటివిటీ ఫ్యాక్టర్ – ఇవన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేయకపోతే .. వార్ 2కి కాస్తే ఓవర్ ఎక్స్‌పోజర్ కావొచ్చు. ఫుల్ యాక్షన్ ఉందో లేదో కంటెంట్ చెబుతుంది .. ఇక మరి వార్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు అందుకుంటుందో తెలియాలంటే ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే..