తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 12.41 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 4.30 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.42 కోట్లు , ఈస్ట్ లో 1.82 కోట్లు , వెస్ట్ లో 1.13 కోట్లు , గుంటూరులో 1.80 కోట్లు , కృష్ణ లో 1.48 కోట్లు , నెల్లూరులో 95 లక్షల లక్షణాలు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో కలిపి 27.41 కోట్ల షేర్ ... 45.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక  , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.94 కోట్ల కనెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 9.30 కోట్ల కలెక్షన్ దక్కాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు ఎనిమిది రోజుల్లో 40.65 కోట్ల షేర్ ... 77.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 53.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా మరో 12.85 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd