
అదేవిధంగా, "కూలి" సినిమా గురించి కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. రజినీకాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోగా, మరొక వర్గాన్ని మాత్రం అంతగా ఆకట్టుకునే విధంగా ఉండకపోవచ్చు అనే అభిప్రాయం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఈ సినిమాకి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుతాయా..? లేదా..? అనేది బిగ్ హాట్ టాపిక్‌గా మారింది.
మన టాలీవుడ్‌లో టికెట్ ధరల హైక్ అనేది అప్ప్డు ఎప్పుడో దాదాపు దశాబ్దం క్రితమే ప్రారంభమైంది అని అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలకు పెట్టుబడులు తిరిగి రాకపోతే మేకర్స్ నష్టపోతారనే భయంతో, ప్రారంభ దశలోనే టికెట్ రేట్లు పెంచుకునే పద్ధతిని తీసుకొచారు కొందరు సినీ పెద్దలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకు హైక్ ఇస్తే అది ఓకే ..పర్వాలేదు. ఎందుకంటే దాని వల్ల ఉపయోగపడేది తెలుగు వర్కర్స్, లాభపడేది తెలుగు ప్రజలే. కానీ డబ్బింగ్ సినిమాలకి హైక్ అవసరమా..?? అనేది ఇప్పుడు బి క్వశ్చన్ మార్క్..?? హై బడ్జెట్ లేని మిడ్ రేంజ్ సినిమాలకు కూడా ఇష్టానుసారంగా హైక్స్ ఇస్తున్నారని జనాలు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ఇది ఎక్కువగా జరుగుతోందని చెప్పాలి. ప్రతి సినిమాకి ఇలా అప్లై చేస్తే, హైక్స్ వచ్చేస్తున్నాయి అంటూ కామన్ పీపుల్స్ మండిపడుతున్నారు. ఇది సినిమా వాళ్లకి బాగానే ఉన్నా, టికెట్ కొనుగోలు చేసే మిడిల్ క్లాస్ ప్రేక్షకులకు మాత్రం ఇబ్బందికరంగా మారుతోంది అంటున్నారు జనాలు.
ఇక లేటెస్ట్‌గా.. పెద్ద డబ్బింగ్ సినిమాలు వచ్చేస్తున్నాయ్. "వార్ 2", "కూలి" వంటి సినిమాలకు కూడా ఏపీలో టికెట్ ధరలు పెంచుతున్నారని సోషల్ మీడియాలో పూర్తిగా నెగిటివ్ టాక్ వినిపిస్తోంది. అసలు డబ్బింగ్ సినిమాలకి హైక్ అవసరం లేదని గతంలో కొందరు నిర్మాతలే హైలైట్ చేశారు. కానీ ఇప్పుడు అదే నిర్మాతలు డబ్బింగ్ సినిమాలకు హైక్ కావాలని ప్రచారం చేస్తున్నారు. ఇది వాళ్లు లాభం కోసం వేసుకున్న పద్ధతి మాత్రమేనని కామన్ పీపుల్స్ మండిపడుతున్నారు. విమర్శకులు కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు.