మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో మలయాళ సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకొని మలయాళ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు దుల్కర్ సల్మాన్ తెలుగు లో కూడా పలు సినిమాలలో నటించాడు. మొదటి సారి దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి సినిమాలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో దుల్కర్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈయన తెలుగు లో సీత రామం , లక్కీ భాస్కర్ అనే రెండు సినిమాలలో నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దానితో దుల్కర్ సల్మాన్ కి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఇకపోతే దుల్కర్ సల్మాన్ కి ఒక నటి అంటే చాలా ఇష్టం అట. ఇంతకు దుల్కర్ సల్మాన్ కు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ..? బాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించి , ఇప్పటికి కూడా అద్భుతమైన రీతిలో కెరీర్లు ముందుకు సాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి కాజోల్.

కాజోల్ అంటే దుల్కర్ సల్మాన్ కి చాలా ఇష్టం అట. ఆమె తన అభిమాన నటి అని ఆయన ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే కాజోల్ ఇప్పటికి కూడా అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఈమె వయస్సు పెరిగిన అద్భుతమైన రీతిలో ఈమె అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది. దానితో ఈమెకు ఇప్పటికి కూడా యువతలో మంచి క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: