
తాజాగా విడుదలైన రాజా సాబ్ ట్రైలర్ మాత్రం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేసింది. ప్రభాస్ స్టైల్, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే ఈ ట్రైలర్‌లోని కొన్ని షాట్స్ చూసి “మారుతి డైరెక్షన్ సరైనంతగా సెట్ కాలేదు” అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే, ట్రైలర్‌లో కనిపించిన ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, పంచ్ డైలాగ్స్ బుజ్జిగాడు సినిమా టైమ్‌ను గుర్తు చేస్తున్నాయి. ఇక ఇక్కడే అసలు హైలైట్ మ్యాటర్ బయటకి వచ్చింది. రాజా సాబ్ ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో మారుతి పేరు కన్నా ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఎందుకంటే ప్రభాస్ కెరీర్‌లో “డార్లింగ్” అనే పిలుపు, అలాంటి ఎనర్జిటిక్ మాస్ ఇమేజ్ మొదటిసారి ఇచ్చింది బుజ్జిగాడు సినిమానే. “ఏండే..ఏదైనా మాట్లాడండి, పాట పాడండి” అంటూ ప్రభాస్ నాటిగా చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ అభిమానుల మదిలో హిట్ అయ్యి ఉన్నాయి. అదే ఫ్లేవర్ రాజా సాబ్ ట్రైలర్‌లో కూడా కనిపించడంతో, ఫ్యాన్స్ నేరుగా బుజ్జిగాడు టైమ్‌ని రీకాల్ చేసుకుంటున్నారు.
దీంతో సోషల్ మీడియాలో మళ్లీ పూరి జగన్నాథ్ పేరు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత తేడాగా ఉంది. ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన పూరి, లైగర్ సినిమా తర్వాత ఇండస్ట్రీలో “ఫ్లాప్ డైరెక్టర్” అనే ట్యాగ్ తెచ్చుకున్నారు. ఆ పేరు ఇప్పుడు పూర్తిగా ఆయనను వెంటాడుతోంది. అయితే ఆయన టాలెంట్, డైరెక్షన్ స్టైల్ మీద ఇంకా చాలా మంది ఫ్యాన్స్‌కి నమ్మకం ఉంది. ఇక పూరి త్వరలోనే విజయ్ సేతుపతితో చేసే ప్రాజెక్ట్‌తో మళ్లీ తన పాత వైభవం రిపీట్ చేస్తారని అభిమానులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఒక్క సినిమా సక్సెస్ చాలు – డైరెక్టర్ కెరీర్ మళ్లీ ట్రాక్ మీదకు వచ్చేయడానికి. అందుకే పూరి రీఎంట్రీ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మొత్తానికి రాజా సాబ్ ట్రైలర్ ప్రభాస్‌కి కొత్త హైప్ ఇచ్చినప్పటికీ, మారుతి పేరు కన్నా ఎక్కువగా చర్చలోకి వచ్చినది మాత్రం పూరి జగన్నాథ్. ఇది కూడా ప్రభాస్ ప్రభావమే అని చెప్పాలి.